క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్,ఎస్పీ శరత్ చంద్ర పవార్
ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:ఎస్‌ఐ,పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి వారి సన్నద్ధత,శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని, శారీరక దృఢత్వంతో పాటు రాత పరీక్షకు కూడా సమర్థవంతంగా సిద్ధం కావాలని తెలిపారు.ఉచిత శిక్షణ ద్వారా అందుతున్న అవకాశాన్ని ప్రతి అభ్యర్థి సద్వినియోగం చేసుకుని పోలీస్ ఉద్యోగం సాధించే దిశగా ముందుకు సాగాలని కలెక్టర్, ఎస్పీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యువతీ యువకులకు ఉద్యోగ సాధనకు అవసరమైన పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ
RELATED ARTICLES

