Thursday, October 15, 2026
prajasamkshemam news
Homeప్రత్యేకంచేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూడ వెంకటరమణ ప్రమాణ స్వీకారం

చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూడ వెంకటరమణ ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

**చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం**
**చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: వేముల వీరేశం**
**హైదరాబాద్:**
తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా నియమితులైన దూడ వెంకటరమణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం హాజరై నూతన చైర్మన్ దూడ వెంకటరమణను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేనేత రంగ అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.నూతన చైర్మన్ దూడ వెంకటరమణ నాయకత్వంలో చేనేత అభివృద్ధి కార్పొరేషన్ మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి కొత్త చైర్మన్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత శాఖ అధికారులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చేనేత కార్మిక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
**PS NEWS | ప్రజా సంక్షేమం న్యూస్*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.