**అక్టోబర్ 23న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశం**
**సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిపై ప్రధాన చర్చ**
**PS NEWS|హైదరాబాద్*దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీసు సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అక్టోబర్ 23న హైదరాబాద్లో నిర్వహించనున్న దక్షిణ ప్రాంతీయ పోలీస్ సమన్వయ కమిటీ (RPCC) సమావేశానికి తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సమావేశానికి ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. పోలీసింగ్, అంతర్గత భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు కార్యాచరణపై దృష్టి సారించనున్నారు.
నేరాల నియంత్రణకు సమన్వయ చర్యలు:సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలు, శాంతిభద్రతల సమస్యలు, అంతర్గత భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రాల మధ్య నిఘా సమాచారాన్ని వేగంగా పంచుకోవడం, కార్యాచరణలో ఉన్న అంతరాలను తగ్గించడం, సమన్వయంతో చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
### జాతీయ పోలీస్ సదస్సు ఎజెండాకు కీలక సూచనలు:హైదరాబాద్లో జరిగే RPCC సమావేశంలో చర్చించి తీసుకునే నిర్ణయాలు, సూచనలు డిసెంబర్లో తిరుపతిలో జరగనున్న 61వ అఖిల భారత డీజీపీలు, ఐజీపీల సదస్సు ఎజెండాకు దోహదపడనున్నాయి.
### సమర్థవంతమైన పోలీసింగ్ లక్ష్యం:ప్రాంతీయ స్థాయి సమావేశాల ద్వారా పోలీసు శాఖల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవచ్చని డీజీపీ సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమన్వయం, సమాచార మార్పిడి, వేగవంతమైన స్పందనతో మరింత సమర్థవంతమైన పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ఆయన వివరించారు.
**PS NEWS – ప్రజా సంక్షేమం న్యూస్**
దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ సమావేశానికి హైదరాబాద్ వేదిక
RELATED ARTICLES

