Monday, October 12, 2026
prajasamkshemam news
Homeజాతీయం‘జై జవాన్ – జై కిసాన్’ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

‘జై జవాన్ – జై కిసాన్’ స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం

📰 Generate e-Paper Clip

లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్,అక్టోబర్2
భారతరత్న,మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.దేశం కోసం నిస్వార్థంగా సేవలందించిన మహోన్నత నాయకుడిగా శాస్త్రిజీని స్మరించుకున్నారు.
‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో స్ఫూర్తి:సైనికుడి ధైర్యం, రైతు శ్రమ దేశ ప్రగతికి రెండు కీలక స్తంభాలని ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదం ద్వారా శాస్త్రిజీ చాటిచెప్పారని సీఎం పేర్కొన్నారు. దేశ రక్షణలో సైనికుల పాత్రతో పాటు ఆహార భద్రతలో రైతుల కృషికి ఆయన ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.
నిజాయితీ, నిరాడంబరతకు ప్రతిరూపం:నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రతిరూపంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ సాధారణ జీవన విధానాన్ని కొనసాగిస్తూ ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని అన్నారు.దేశం కోసం శాస్త్రిజీ అందించిన సేవలను, ఆయన చూపిన విలువలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.