Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు

నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీపై ఆరోపణలు

📰 Generate e-Paper Clip

ఎనిమిదేళ్ల తర్వాత పత్రాలు.. సిలిండర్‌, స్టవ్‌ ఏవంటూ లబ్ధిదారురాలి ప్రశ్న
ప్రజాసంక్షేమం న్యూస్ నాగార్జునసాగర్
: పేద మహిళలకు అందాల్సిన ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకం ప్రయోజనాలు తనకు అందలేదంటూ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీకి చెందిన మహిళా సంఘ సభ్యురాలు ఆత్మకూరు సుప్రతిక ఆరోపించారు.2018లో ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం రెండుసార్లు దరఖాస్తు చేసినప్పటికీ తనకు కనెక్షన్ రాలేదని, తాజాగా తన పేరుపై ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు ఏజెన్సీ సిబ్బంది తెలిపారని పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత పత్రాలు అందజేస్తూ, సిలిండర్‌, గ్యాస్ స్టవ్‌ తామే కొనుగోలు చేసుకోవాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు తెలియకుండానే తన పేరుపై గ్యాస్ కనెక్షన్ ఎలా మంజూరైందని, సబ్సిడీ జమ అవుతున్నట్లయితే ఆ కనెక్షన్‌ను ఎవరు వినియోగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తనకు అందాల్సిన ఉచిత సిలిండర్‌, స్టవ్‌ ఏమయ్యాయని నిలదీశారు.ఈ నేపథ్యంలో నిడమనూరు భారత్ గ్యాస్ ఏజెన్సీ రికార్డులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
ఉన్నతాధికారులు స్పందించాలి:
ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, గ్యాస్ కనెక్షన్ మంజూరు వివరాలు, లబ్ధిదారుల రికార్డులు, సబ్సిడీ చెల్లింపులపై సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రతిక డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, అర్హులైన పేద మహిళలకు న్యాయం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.