Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణపట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం

📰 Generate e-Paper Clip

రామన్నపేటలో ఓటరు నమోదు సహాయ కేంద్రం పరిశీలన
ప్రజాసంక్షేమం న్యూస్ రామన్నపేట
:నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సూచించారు.రామన్నపేటలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు సహాయ కేంద్రాన్ని ఆయన సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన పట్టభద్రుల సంఖ్య, దరఖాస్తు ఫారాల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన పట్టభద్రుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ, పట్టభద్రుల నమోదు కోసం సమన్వయంతో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.