Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 1న ఛలో ఢిల్లీ!

ఓటు హక్కు పరిరక్షణ కోసం నవంబర్ 1న ఛలో ఢిల్లీ!

📰 Generate e-Paper Clip

**నల్గొండ నుంచి 2 వేల మంది తరలిరావాలి:కాంగ్రెస్ నేతలు రాంభూపాల్ రెడ్డి, వినోద్ రెడ్డి**
ప్రజాసంక్షేమం న్యూస్న నల్గొండ:
ఎస్‌ఐఆర్‌ (SIR) ప్రక్రియలో ఓటర్ల తొలగింపు జరిగిందని ఆరోపిస్తూ, దానిని నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకులు రాంభూపాల్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మీడియాతో మాట్లాడారు.దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని డిమాండ్ చేశారు.ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీకి నల్గొండ జిల్లా నుంచి సుమారు 2,000 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, **“ఓటును కాపాడుకుందాం – దేశాన్ని రక్షించుకుందాం”** అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.