Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుమెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌తో ప్రత్యక్ష ప్రయాణం

మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌తో ప్రత్యక్ష ప్రయాణం

📰 Generate e-Paper Clip

ప్రజా రవాణా అనుసంధానంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం
కామన్ పాస్ వినియోగం, ప్రయాణ సౌకర్యంపై ప్రయాణికుల అభిప్రాయాలు సేకరణ
ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలు.. సమయం, శ్రమ ఆదా
హైదరాబాద్:
నగరంలో ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ సేవలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.కామన్ పాస్‌ను వినియోగిస్తూ బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సెక్రటేరియట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.ఈ సందర్భంగా ప్రయాణికులతో నేరుగా మాట్లాడిన మంత్రి.. కామన్ పాస్ వినియోగం, మెట్రో–ఆర్టీసీ అనుసంధానం, ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సౌకర్యాలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఒకే కామన్ పాస్‌తో మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించుకునేలా ప్రజా రవాణా వ్యవస్థను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులకు సమయం, శ్రమ ఆదా కావడంతో పాటు గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.నగర ప్రజలకు మెరుగైన, సమన్వయంతో కూడిన ప్రజా రవాణా సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

#RTC #Metro #Telangana

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.