Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణసింగరేణిని బహుళ ఖనిజాల అన్వేషణ సంస్థగా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణిని బహుళ ఖనిజాల అన్వేషణ సంస్థగా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

📰 Generate e-Paper Clip

బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి.. ఉత్పాదకత పెంచాలి
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
సింగరేణి కాలరీస్ సంస్థను మరింత బలోపేతం చేసి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సింగరేణికి చెందిన 66 మంది జనరల్ మేనేజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన సంస్థ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచాలని, కొత్త బొగ్గు గనుల అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లిథియం, రాగి, బంగారం, వెనేడియం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ రంగాల్లోకి సింగరేణి విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
గత పదేళ్లలో సింగరేణి విస్తరణ నిర్లక్ష్యానికి గురైందని, బొగ్గు బ్లాకుల విషయంలో సంస్థకు నష్టం జరిగిందని విమర్శించారు. సుమారు 78 వేల మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ సింగరేణిని లాభాల బాటలో నడిపించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.