Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణ2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం...

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

📰 Generate e-Paper Clip

సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణతోనే సుస్థిర ప్రగతి సాధ్యం
హైదరాబాద్, ప్రజాసంక్షేమం న్యూస్
: డాక్టర్ ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థ 50 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబం జీవితంలో సానుకూల మార్పు తీసుకురావాలని ఆకాంక్షించారు.సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణతోనే సుస్థిర ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో సాధించిన ఆర్థిక, సాంకేతిక అభివృద్ధిని రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలకు విస్తరించి, యువతకు సొంత జిల్లాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు.రైతు కుటుంబాలకు సమగ్ర భద్రత కల్పించడం, పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతలని స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ సేవలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.నిస్వార్థ ప్రజాసేవకుడు ఎస్.ఆర్. శంకరన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అధికారులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.