ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ భేటీ
ప్రజాసంక్షేమం న్యూస్ న్యూఢిల్లీ:ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సోమవారం ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా AIPC భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత విస్తరణ, దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్‌ను ఏకం చేయడం, పాలసీ మేకింగ్‌లో నిపుణుల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్‌ను రాజకీయాలు, పాలసీ రూపకల్పన, ప్రజా సమస్యలు, దేశ నిర్మాణంతో అనుసంధానం చేయడమే AIPC ప్రధాన లక్ష్యమని మధుయాష్కీ గౌడ్ తెలిపారు. ఇందుకోసం వచ్చే ఏడాది కాలానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ:
రాబోయే ఆరు నెలల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో AIPCను బలోపేతం చేయడంతో పాటు జిల్లా, నియోజకవర్గం, నగరం,స్థానిక స్థాయిల వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలోని ప్రొఫెషనల్స్‌ను సంస్థతో అనుసంధానం చేసి, వారి సమస్యలు,సూచనలు, నిపుణుల అభిప్రాయాలను పాలసీ రూపకల్పనలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు.డాక్టర్లు,ఇంజనీర్లు,లాయర్లు,ఆర్కిటెక్టులు, ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు, కళాకారులు,క్రీడా నిపుణులు,జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, స్కిల్డ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ సహా అన్ని రంగాల నిపుణులను AIPCలో భాగస్వాములను చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు మధుయాష్కీ గౌడ్ తెలిపారు.

