ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కరపత్రం ఆవిష్కరణ
నల్లగొండ, నవంబర్ 19 (ప్రజా సంక్షేమం న్యూస్):
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇందిరాగాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు.ప్రతి కుటుంబానికి భరోసా కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించే పథకానికి సంబంధించిన గుర్తింపు కరపత్రాన్ని పున్న కైలాష్ నేత ఈ సందర్భంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చర్లపల్లి గౌతమ్, పగిళ్ల రాజు, వేముల గోపీనాథ్, ఇందనూరి శ్రీను, ఆకటి సైదులు, ఎండీ అజీజ్, చింతపల్లి బాలకృష్ణ, చింత వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

