చిట్యాల, ప్రజా సంక్షేమం న్యూస్:నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు ప్రయాణ సమయంలో వరుసగా రెండుసార్లు తృటిలో ప్రమాదాలు తప్పాయి. కట్టంగూరు మండలం ఐటిపాముల సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది.ఈ ఘటన అనంతరం ఎమ్మెల్యే మరో కారులో ప్రయాణం కొనసాగించగా, వలిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసమైనప్పటికీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన క్షేమంగా బయటపడ్డారు.వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పటికీ ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
Homeతాజా వార్తలుఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం.. వరుసగా రెండుసార్లు కార్లను ఢీకొట్టిన వాహనాలు!
ఎమ్మెల్యే వేముల వీరేశంకు తృటిలో తప్పిన ప్రమాదం.. వరుసగా రెండుసార్లు కార్లను ఢీకొట్టిన వాహనాలు!
0
24

