Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. నీటిని పొదుపుగా వాడుకోవాలి

ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. నీటిని పొదుపుగా వాడుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రజలకు ఆర్టీఐ యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎం.డి. ఖాజా మొయినొద్దీన్ విజ్ఞప్తి
ప్రజాసంక్షేమం న్యూస్:

రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు చోటుచేసుకుని నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ (RTI) యాక్టివిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి ఎం.డి.ఖాజా మొయినొద్దీన్ విజ్ఞప్తి చేశారు.వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతంపై ప్రతికూల ప్రభావం పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. నీటి సమస్య తీవ్రరూపం దాల్చకముందే ప్రతి ఒక్కరూ నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రోజువారీ అవసరాలకు అవసరమైనంత నీటినే వినియోగిస్తూ, నీటి వృథాను పూర్తిగా నివారించాలని కోరారు.అలాగే వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడటం మనందరి సామాజిక బాధ్యత అని, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి నీటిని పొదుపుగా వినియోగించాలని ఎం.డి. ఖాజా మొయినొద్దీన్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.