ఖమ్మంలో ఎన్నికల సన్నాహక సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
ప్రజాసంక్షేమం న్యూస్ ఖమ్మం:నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ న్యాయవాది కొల్లి సత్యనారాయణ విజయానికి పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు సమిష్టిగా కృషి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పీడీఎఫ్ అభ్యర్థి కొల్లి సత్యనారాయణను గెలిపించేందుకు పట్టభద్రుల ఓటర్లను చైతన్యపరచాలని అన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాడే అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు.ఈ సమావేశంలో సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార బాధ్యులు పాల్గొన్నారు.

