Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనకిరేకల్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

నకిరేకల్‌లో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – ఎమ్మెల్యే వేముల వీరేశం
ప్రజాసంక్షేమం న్యూస్ నకిరేకల్:
పేద,మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని నకిరేకల్ నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా రూ.5 లక్షల బీమా సాయం అందించే గొప్ప పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో ఈ పథకం ఎంతో కీలకమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని, ప్రజల్లో ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకొని క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకం వివరాలను తెలియజేసి, అర్హులైన కుటుంబాలకు బీమా ప్రయోజనాలు అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల మాధవరెడ్డి, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.