జీఓ కాపీని అందుకున్న నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి భవన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సహకారంతో రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ కాపీని గురువారం హైదరాబాద్లో అందజేశారు.తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి. హనుమంతరావు చేతుల మీదుగా పద్మశాలి సంఘం పెద్దల సమక్షంలో నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత జీఓ కాపీని అందుకున్నారు.ఈ సందర్భంగా పద్మశాలి భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల పద్మశాలి సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. భవన్ నిర్మాణం ద్వారా పద్మశాలి సంఘం కార్యక్రమాలకు అవసరమైన వేదిక అందుబాటులోకి రానుంది.
తెలంగాణ పద్మశాలి భవన్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు మంజూరు
RELATED ARTICLES

