Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలి: మంత్రి
రైతుల సమక్షంలోనే సమగ్ర భూ సర్వే – భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
మేడ్చల్–మల్కాజిగిరి:
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి పండుగను లబ్ధిదారులతో కలిసి ఘనంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు వెల్లడించారు.తొలి విడతలో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని తెలిపారు. పేద కుటుంబాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు నింపాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దీపావళి రోజున ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు లబ్ధిదారులతో కలిసి వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. అర్హులైన ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రైతుల సమక్షంలోనే భూ సర్వే:మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టరేట్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని పలు సమస్యలను ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా చేపట్టిన భూముల రీసర్వేను రైతుల సమక్షంలోనే నిర్వహించి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.రీసర్వే జరుగుతున్న గ్రామాల్లో తహసీల్దార్లు ప్రతిరోజూ పర్యటించాలని, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఉన్నతాధికారులు కనీసం వారానికి ఒకరోజైనా రీసర్వే గ్రామాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించాలని ఆదేశించారు.రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూముల సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలను సమగ్ర సర్వే ద్వారా గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. 22-ఏ కింద ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలతో పరిష్కారం కాని సమస్యలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా భూ సర్వే నిర్వహించి, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.