రూ.2,000 కోట్లతో డబుల్ రోడ్ల విస్తరణ – ప్రతి ఇంటికీ 24 గంటల తాగునీరు
రూ.27.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నల్లగొండ, నవంబర్ 5 (ప్రజా సంక్షేమం న్యూస్):
నల్లగొండ పట్టణాన్ని ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. జిల్లాలో రూ.2,000 కోట్లతో డబుల్ రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది.రాబోయే ఏడాదిన్నరలో ప్రతి ఇంటికీ 24 గంటల పాటు నిరంతర తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు పేర్కొంది.ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో నల్లగొండలో రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత మండల కార్యాలయాల భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.10 కోట్ల వ్యయంతో మామిళ్లగూడ మీదుగా కతాల్గూడ–రాజీవ్ స్వగృహ రోడ్డు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.నల్లగొండ సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్రజలకు మెరుగైన రవాణా, తాగునీరు, ప్రభుత్వ సేవలు అందించడం ద్వారా జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
నల్లగొండను ‘సూపర్ స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
RELATED ARTICLES

