Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeబిజినెస్పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం: ఉప ముఖ్యమంత్రి

పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం: ఉప ముఖ్యమంత్రి

📰 Generate e-Paper Clip

–పరిశ్రమల స్థాపనకు భూములు, రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం
-ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా.. ఉపాధి కల్పించే స్థాయికి యువత ఎదగాలి
-యువ పారిశ్రామికవేత్తలు నిశాంత్, సాజన్‌ల కృషి అభినందనీయం
-ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
రంగారెడ్డి, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్):

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు, రాయితీలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రగతితో పాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజు కుటుంబానికి చెందిన ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా స్వయంగా పరిశ్రమలు స్థాపించి, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
యువ పారిశ్రామికవేత్తలకు అభినందనలు!

ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన యువ పారిశ్రామికవేత్తలు నిశాంత్, సాజన్‌ల కృషిని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. ఉన్నత విద్యాభ్యాసం అనంతరం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన స్థల కేటాయింపులో ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.
ప్రజా చైతన్యానికి జయరాజు పాటలు ఆయుధాలు:ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజు సమాజానికి అందించిన సేవలను ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన కళను సమాజ హితం కోసం వినియోగించడం గొప్ప విషయమన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, శ్రమజీవుల హక్కులు, అణగారిన వర్గాల జీవితాలను తన పాటల ద్వారా ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన రచించిన పాటలు ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు.కళాకారులు, మేధావులు, సామాజిక చైతన్యం కోసం కృషి చేసే వ్యక్తులను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పాలకులు అధికారాన్ని హోదాగా కాకుండా ప్రజలకు సేవ చేసే బాధ్యతగా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సమానత్వం, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని వివరించారు.
పర్యావరణ పరిరక్షణతోనే అభివృద్ధి:పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి విక్రమార్క సూచించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ఉన్న చెట్లను తొలగించకుండా ప్రకృతిని కాపాడుతూ అభివృద్ధి సాధించాలనే ఎన్‌ఎస్ ఇండస్ట్రీస్ నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. పర్యావరణ హిత పారిశ్రామికాభివృద్ధికి ఈ సంస్థ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డిక్కీ అధ్యక్షుడు నర్రా రవికుమార్, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.