Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతెలంగాణరాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

రాష్ట్ర ఆదాయ వనరుల బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

📰 Generate e-Paper Clip

ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువులో సాధించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజా సంక్షేమం న్యూస్|హైదరాబాద్
:రాష్ట్ర ఆర్థిక వనరులను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి శాఖ వారాలవారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని, ఆదాయ లక్ష్యాల సాధనపై నిరంతరం సమీక్షలు నిర్వహించాలని సూచించారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట పారిశ్రామిక ప్రాంతాల్లో భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు.పారిశ్రామికవేత్తల దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ అవకాశాలను పరిశీలించి, భవిష్యత్తులో చేపట్టే ప్రభుత్వ ప్రాజెక్టులకు అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని సూచించారు.
ప్రభుత్వ భూముల వినియోగంలో ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, రహదారులు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. హెచ్‌ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని భూములను అభివృద్ధి చేసి, వేలం ద్వారా ఆదాయం సమకూర్చుకునే అవకాశాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని అధికారులకు సూచించారు.వేలానికి అనువైన లేఅవుట్లు, సిద్ధంగా ఉన్న ప్లాట్లు, భూముల స్థితిగతులు, మౌలిక సదుపాయాల వివరాలతో వచ్చే వారంలోగా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు, లేఅవుట్లు, వేలం ప్రక్రియ, ఆదాయ సమీకరణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక డిజిటల్ డ్యాష్‌బోర్డ్ రూపొందించాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ ఆస్తుల విలువను పెంచుతూ, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని మరింత బలోపేతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.