Wednesday, November 11, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుగ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

గ్రామ పంచాయతీల అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి

📰 Generate e-Paper Clip

శాలిగౌరారం మండల పరిషత్ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్ శాలిగౌరారం:
గ్రామ పంచాయతీల అభివృద్ధి, సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై శాలిగౌరారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సమావేశానికి నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామ పంచాయతీల అభివృద్ధి, స్థానిక మౌలిక సదుపాయాల కల్పన, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పి. శంకర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ ఎన్. రమాదేవి, ఎంఆర్ఓ మనోహర్ రావు, డీఈపీఆర్ కొండయ్య, సూపరింటెండెంట్ శ్రీనివాసాచారి, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.