Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలురైతుల ప్రభుత్వ, ప్రైవేటు అప్పులు రీ-షెడ్యూల్ చేసి మారటోరియం ప్రకటించాలి

రైతుల ప్రభుత్వ, ప్రైవేటు అప్పులు రీ-షెడ్యూల్ చేసి మారటోరియం ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

ఎల్నినో కరువుతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి.. జిల్లా కలెక్టర్‌కు ప్రజా పోరాట సమితి వినతి
ఎండిన వరికి ఎకరాకు రూ.40 వేలు, పత్తికి రూ.60 వేల నష్టపరిహారం ఇవ్వాలి: నూనె వెంకటస్వామి
నల్గొండ, నవంబర్ 20 (ప్రజా సంక్షేమం న్యూస్):
ఎల్నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకున్న ప్రభుత్వ, ప్రైవేటు అప్పులన్నింటినీ రీ-షెడ్యూల్ చేసి మారటోరియం ప్రకటించాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతాంగం తీవ్ర పంట నష్టాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అప్పుల వసూళ్ల కోసం రైతులపై ఒత్తిడి తీసుకురాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.ఎల్నినో కరువు కారణంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఎండిపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయని తెలిపారు. దీంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి తీవ్ర నష్టాలను చవిచూశారని పేర్కొన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో వరి, పత్తి పంటల దిగుబడులు తగ్గడంతో పాటు ఇతర పంటలు సైతం ఎండిపోయి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు తీసుకున్న అన్ని రకాల అప్పులను రీ-షెడ్యూల్ చేయాలని, అప్పులపై వడ్డీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మారటోరియం ప్రకటించి రైతులకు ఊరట కల్పించడంతో పాటు, తదుపరి పంటల సాగుకు కొత్త రుణాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలి:కరువు నష్టాల అంచనాల్లో కౌలు రైతులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వెంకటస్వామి సూచించారు. రైతాంగంలో సుమారు 40 శాతం మంది కౌలు రైతులే ఉన్నారని పేర్కొంటూ, పంట నష్టపరిహారం నేరుగా సాగు చేసిన కౌలు రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చట్టపరమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర ధరలను నియంత్రించాలి:కరువు బాధిత రైతులకు ఎకరాకు రూ.60 వేల వరకు పరిహారం ఇవ్వాలి:పంటలు పండకపోవడం, వ్యవసాయ కూలీలకు పనులు లేకపోవడం, మరోవైపు నిత్యావసర ధరలు పెరగడం వంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కరువు నివారణ చర్యలు సమర్థవంతంగా చేపట్టడం లేదని విమర్శించారు. మండలాల స్థాయిలో కరువు ప్రకటించడం మాత్రమే కాకుండా, రైతులకు నిర్దిష్టమైన ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.40 వేల చొప్పున, ఎండిపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.60 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పని దినాలు కల్పించాలని, వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రజా పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు బర్రె సంజీవ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు యాదయ్య యాదవ్, పీఆర్పీఎస్ నాయకులు మారుగోని వెంకన్న గౌడ్, షేక్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.