Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeతెలంగాణహార్డ్‌వేర్ పార్క్ భూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం!

హార్డ్‌వేర్ పార్క్ భూ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం!

📰 Generate e-Paper Clip

సీఎంను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం – ప్రొఫెసర్ కోదండరాం
ఐక్యంగా పోరాడితేనే భూ సమస్యకు శాశ్వత పరిష్కారం!
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:
హార్డ్‌వేర్ పార్క్ భూసేకరణ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. భూ సమస్య పరిష్కారం కోసం పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.ఆదిభట్ల, ఎం.ఎం. కుంట, నాదర్‌గుల్ గ్రామాల భూసేకరణ బాధితుల సమావేశం ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన ఆధారాలు సేకరించామని, వాటితో ప్రభుత్వాన్ని నిలదీసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బాధితులు నిరాశ చెందకుండా ఐక్యతతో పోరాడాలని పిలుపునిచ్చారు.2004లో హార్డ్‌వేర్ పార్క్, వర్క్ సెంటర్ పేరుతో సుమారు 5 వేల ఎకరాలకు 28 భూసేకరణ నోటిఫికేషన్లు జారీ కాగా, నష్టపరిహారం చెల్లించని భూములను సైతం TGIIC పేరుతో నమోదు చేసి నిషేధిత జాబితాలో చేర్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని భూసేకరణ నోటిఫికేషన్లను హైకోర్టు కొట్టివేయగా, ప్రభుత్వ అప్పీలును సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని తెలిపారు.అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన 245 ప్లాట్ల చుట్టూ పరిహారం, నోటీసులు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 20 వేల ప్లాట్ల యజమానుల సమస్యలను పరిష్కరించి, భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు అంబటి నాగయ్య, టీజేఎస్ నాయకుడు బైరి రమేష్, జేఏసీ చైర్మన్ మాధవరం రామేశ్వర్ రావు, కన్వీనర్ దార సత్యం, అభినందన హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గండూరి భాస్కర్, ప్రధాన కార్యదర్శి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.