Monday, August 24, 2026
prajasamkshemam news
HomeUncategorizedకట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.

కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.

📰 Generate e-Paper Clip

స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ…

పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులకు ఆదేశం…

రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, బెయిల్‌పై ఉన్న నేరస్థులపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచన…

అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తరచూ నాకాబందీలు, వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశం…

నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచన…

అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్, సీటుబెల్ట్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఆదేశం…

బ్లాక్‌స్పాట్‌ల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచన…

సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, ఆన్‌లైన్ మోసాల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశం…

ప్రతి ఫిర్యాదును సున్నితంగా స్వీకరించి వేగవంతంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచన…

పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు…

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం అందించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత..

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.