Sunday, August 23, 2026
prajasamkshemam news
HomeUncategorizedహైడ్రా DRF అసిస్టెంట్ల నియామకానికి నిరుద్యోగుల సంఖ్య నమోదు: సరూర్ నగర్ స్టేడియంలో సందడి

హైడ్రా DRF అసిస్టెంట్ల నియామకానికి నిరుద్యోగుల సంఖ్య నమోదు: సరూర్ నగర్ స్టేడియంలో సందడి

📰 Generate e-Paper Clip

వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు.. ఎంపికల నిర్వహణకు శ్రమించిన అధికారులు
పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశాంతంగా సహకరించిన యువత


హైదరాబాద్ (ప్రజా సంక్షేమం):
హైడ్రా (HYDRAA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పరిధిలోని 100 DRF అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ల కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ శనివారం సరూర్ నగర్ స్టేడియంలో ప్రారంభమైంది. ఆగస్టు 8, 9 తేదీల్లో ఈ ఎంపికలు ఉంటాయని ఇదివరకే ప్రకటించడంతో, ఉదయాన్నే దాదాపు 3 వేల మందికి పైగా అభ్యర్థులు మైదానానికి తరలివచ్చారు.అభ్యర్థుల రద్దీ – అధికారుల సమయస్ఫూర్తి:ఒకేసారి వేలాది మంది అభ్యర్థులు రావడంతో దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్ ఈవెంట్స్ కోసం టోకెన్ల జారీ క్రమంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. రద్దీని నియంత్రించే క్రమంలో ఒకానొక దశలో అధికారులు కాస్త అసహనానికి గురైనప్పటికీ, వెంటనే సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా స్థానిక పోలీసుల సహకారంతో ఏర్పాట్లను క్రమబద్ధీకరించారు.ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ:హాజరైన అభ్యర్థులందరి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రతి ఒక్కరికీ శారీరక సామర్థ్య పరీక్షలకు (Physical Tests)అవకాశం కల్పిస్తామని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా పదేపదే మైక్ అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో అభ్యర్థులు సైతం పరిస్థితులను అర్థం చేసుకుని, అధికారులకు సహకరించడంతో ఎంపికల ప్రక్రియ ఎంతో క్రమశిక్షణతో, ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది.
రిపోర్ట్: దోమలపల్లి గోపి (ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రతినిధి) | 9248307393

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.