ప్రజాసంక్షేమం న్యూస్:
మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆ సంఘం మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పల్లె పల్లెనా స్వచ్ఛందంగా ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచిన ఉద్యమ కళాకారులకు సారధిలో వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ₹1000 రోజులు గడిచినా ఇంకా కళాకారుల గురించి సరైన నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధాకరం అన్నారు అసెంబ్లీలో సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు కళాకారులపై మాట్లాడిన మాటలు కాలయాపానికే పరిమితయం అయ్యాయని విమర్శించారు అసెంబ్లీలో కళాకారుల గురించి మాట్లాడిన శ్రీమతి విజయశాంతి గారికి కళాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొంతమంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి అసలైన కళాకారులకు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అతి తొందరలో సారధిలో ఉద్యోగాల ప్రక్రియను ప్రారంభించకుంటే 33 జిల్లాల కళాకారుల మంత ఏకమై రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు మాలిగ యాదయ్య,తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు,కోశాధికారి శివరాత్రి రాములు, కార్యదర్శి మేడి సైదులు,రొమ్ముల శంకర్, తదితరులు పాల్గొన్నారు

