Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై భట్టి సమీక్ష:

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై భట్టి సమీక్ష:

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 7 నుంచి 9 వరకు గ్లోబల్ సమ్మిట్
భారీ పెట్టుబడుల ఆకర్షణకు దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోలు

ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహక సమావేశం జరిగింది.డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న సమ్మిట్ ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సూచించారు.దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో సమ్మిట్ కీలక మైలురాయిగా నిలవాలని పేర్కొన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను వార్‌రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.