ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఆడిట్లు..
లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలి!
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ధికారులతో సమీక్ష నిర్వహించారు.అన్ని హెల్త్ ఫెసిలిటీల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ల నిర్వహణ,ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు,వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.
రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ ఆడిట్లు:ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్ సేఫ్టీ ఆడిట్లలో గుర్తించిన లోపాలు, వాటిపై తీసుకున్న చర్యలను సమీక్షించారు.
లోపాలు ఉంటే తక్షణ చర్యలు:ఫైర్ సేఫ్టీ ప్రమాణాల్లో లోపాలు ఉన్న ఆస్పత్రుల్లో వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోగులు, వైద్య సిబ్బంది, సందర్శకుల భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తకుండా అన్ని హాస్పిటళ్లలో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు.సెక్రటేరియట్‌లో జరిగిన ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్టల్, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణతో పాటు హెల్త్, ఎనర్జీ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి దామోదర రాజనర్సింహ
RELATED ARTICLES

