30న నూతన కలెక్టరేట్ ప్రారంభం.. భద్రత, ట్రాఫిక్‌పై అధికారులకు కీలక సూచనలు
ప్రజాసంక్షేమం న్యూస్ కరీంనగర్: ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఎమ్మెల్యేలు,ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.భద్రత,ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి
సీఎం పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు సూచించారు. సీఎం పర్యటన కోసం ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను కూడా పరిశీలించారు.
నూతన కలెక్టరేట్‌లో ఏర్పాట్ల పరిశీలన:కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ప్రాంగణం,జిల్లా కలెక్టర్ ఛాంబర్‌తో పాటు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
అధికారులకు సీఎం దిశానిర్దేశం:కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం,జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లో సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్
RELATED ARTICLES

