Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణమిర్యాలగూడ కోర్టుకు 6 ఎకరాల స్థలం కేటాయించాలి:మిర్యాలగూడ బార్ అసోసియేషన్

మిర్యాలగూడ కోర్టుకు 6 ఎకరాల స్థలం కేటాయించాలి:మిర్యాలగూడ బార్ అసోసియేషన్

📰 Generate e-Paper Clip

DROను కోరిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు
ఆధునిక కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతి..
ప్రజాసంక్షేమం న్యూస్–నల్లగొండ,సెప్టెంబర్ 24:

మిర్యాలగూడ పట్టణంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఆర్.దశరథ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం పెరుగుతున్న వ్యాజ్యాల సంఖ్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరిపోవడం లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు తెలిపారు.న్యాయవాదులు,కక్షిదారులు,కోర్టుకు వచ్చే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులతో ఆధునిక కోర్టు కాంప్లెక్స్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.నూతన కోర్టు భవనాల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఆరు ఎకరాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని DROను కోరారు.వినతిపత్రాన్ని స్వీకరించిన DRO ఆర్.దశరథ్ సానుకూలంగా స్పందిస్తూ,ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లి,నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈసరం కరుణాకర్,ప్రధాన కార్యదర్శి జంగిలి ఎల్లయ్య, జాయింట్ సెక్రటరీ రాయారపు భాస్కర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురామారావు,అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గోదాల వెంకట్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.