Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్అమృత–ప్రణయ్ హత్య కేసులో A4గా శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి!

అమృత–ప్రణయ్ హత్య కేసులో A4గా శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి!

📰 Generate e-Paper Clip

చర్లపల్లి జైలులో గుండె నొప్పితో అస్వస్థత..
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం!
పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో మృతదేహం!
నల్లగొండ, ప్రజా సంక్షేమం న్యూస్:

మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత్–ప్రణయ్ హత్య కేసులో A4 నిందితుడిగా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందినట్లు సమాచారం.చర్లపల్లి జైలులో ఉన్న అబ్దుల్ బారీ గురువారం గుండె నొప్పితో అస్వస్థతకు గురైనట్లు సమాచారం.దీంతో జైలు సిబ్బంది వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అబ్దుల్ బారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో ఉంచినట్లు సమాచారం.
గతంలో మరో హత్య కేసులోనూ శిక్ష:నల్లగొండలోని ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీ, గతంలో హరేన్ పాండే హత్య కేసులోనూ జైలు శిక్ష అనుభవించినట్లు సమాచారం. అనంతరం అమృత్–ప్రణయ్ హత్య కేసులో A4గా జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.అబ్దుల్ బారీ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ధ్రువీకరణ మరియు పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.