2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం
2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ!
అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచనున్న ప్రభుత్వం!
ప్రజా సంక్షేమ న్యూస్ హైదరాబాద్:తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా,2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి,హైదరాబాద్‌కు చెందిన GFST వైస్ చైర్మన్ ఎస్.పీ.టక్కర్‌తో పాటు GFST ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రణాళిక–అమలుపై ప్రత్యేక దృష్టి:రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను మరింత బలోపేతం చేయడం,ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం,అభివృద్ధి కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థలను రూపొందించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
TSDPSలో ప్రత్యేక PMU ఏర్పాటు:
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం **(TSDPS)**ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ (PMU) ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రాధాన్యతా అభివృద్ధి కార్యక్రమాలకు వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం,శాఖల మధ్య సమన్వయం, కార్యక్రమాల అమలు,పర్యవేక్షణ,పురోగతిని వేగవంతం చేయడం PMU ప్రధాన బాధ్యతలుగా ఉండనున్నాయి.
2030 నాటికి జీరో పావర్టీ లక్ష్యం:తెలంగాణను 2030 నాటికి‘జీరో పావర్టీ’రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక,లక్ష్యిత కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను నిర్దిష్ట కాలవ్యవధిలో సాధించేలా కార్యాచరణను రూపొందించనున్నారు.సమావేశంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమం న్యూస్ | హైదరాబాద్
2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి
RELATED ARTICLES

