మెట్పల్లిలో రూ.63 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ CDPO
జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 27 (ప్రజాసంక్షేమం న్యూస్):
జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మెట్పల్లి పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి లంచం వసూలు చేస్తున్న చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) దారోజు పద్మను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.మెట్పల్లి పరిధిలోని 21 అంగన్వాడీ కేంద్రాల నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.63,000 లంచం తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.అంగన్వాడీ కేంద్రాలపై ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.లంచాన్ని నెలవారీ వాయిదాల తరహాలో వసూలు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

