Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణజనంపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..

జనంపల్లిలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..

📰 Generate e-Paper Clip

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
జనంపల్లి, రామన్నపేట మండలం (ప్రజాసంక్షేమం న్యూస్):

రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు ఎస్సై సతీష్ వర్మ జనంపల్లిలోని గణేష్ మండపాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు ఎస్సైసతీష్ వర్మను శాలువాతో ఘనంగా సన్మానించారు.
గ్రామంలో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు యువత ఐక్యత, సామాజిక బాధ్యతను చాటేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హనుమాన్ యూత్ సభ్యులను ఎస్సై అభినందించారు.
గణేష్ మండపాన్ని సందర్శించి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్సై సతీష్ వర్మకు హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.