Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతాజా వార్తలుపోషణ మాసంలో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన:

పోషణ మాసంలో ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన:

📰 Generate e-Paper Clip

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాల ప్రదర్శన
చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి:ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్. సరిత
హాలియా, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్):

పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం చింతగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఎస్. సరిత అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ రోజువారీ ఆహారంలో చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిరుధాన్యాలను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.అలాగే ఆహారంలో చక్కెర, ఉప్పు వినియోగాన్ని తగ్గించాలని, మైదా పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. బయట లభించే చిరుతిళ్లకు అలవాటు పడకుండా పోషక విలువలు కలిగిన ఇంటి ఆహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామచందర్ నాయక్, పాషా, చింతగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.