Monday, October 12, 2026
prajasamkshemam news
Homeతెలంగాణహైదరాబాద్‌ను గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.సిఎస్

హైదరాబాద్‌ను గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.సిఎస్

📰 Generate e-Paper Clip

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
‘స్టోరీస్,గేమ్స్&డ్రీమ్స్’థీమ్‌తో యువతకు ఆకర్షణీయ కార్యక్రమాలు…
సుమారు 50 వేల మంది సందర్శకులకు అవకాశం:సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్:

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రముఖ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యం:ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు సీఎస్ తెలిపారు. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, క్రియేటివ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లోని ప్రపంచ ప్రఖ్యాత సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించి, వాటి కేంద్రాలను ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
‘స్టోరీస్, గేమ్స్ & డ్రీమ్స్’తో ప్రత్యేక కార్యక్రమాలు:“Stories, Games & Dreams” థీమ్‌తో యువతను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సమ్మిట్‌లో భాగంగా కామిక్, గేమింగ్ & వీఎఫ్‌ఎక్స్ బిజినెస్ డే నిర్వహించనున్నారు. అలాగే Comic Con, DreamHack, India Game Utsavతో పాటు B2B Expo, Innovation Zone, Animation Stalls ఏర్పాటు చేయనున్నారు.
50 వేల మందికి పైగా సందర్శకులకు అవకాశం:హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 50 పెద్ద, 150 మధ్యస్థాయి యానిమేషన్, గేమింగ్ సంస్థలు ఉన్నాయని సీఎస్ తెలిపారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంతో పాటు యువతకు ఈ రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కూడా గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. సుమారు 70 కళాశాలల విద్యార్థులు, దాదాపు 50 వేల మంది సందర్శకులు కార్యక్రమాలు, ప్రదర్శనలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.యువతలో సృజనాత్మకత, నైపుణ్యాలను పెంపొందించి, క్రియేటివ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.