Wednesday, October 14, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఉమ్మడి నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్ష

ఉమ్మడి నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులపై కీలక సమీక్ష

📰 Generate e-Paper Clip

పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే వేముల వీరేశం

ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువలు, అయిటిపాముల లిఫ్ట్‌పై ప్రత్యేక దృష్టి

భూసేకరణ పూర్తి చేసి నిధులు విడుదల చేయాలని మంత్రి ఉత్తమ్‌కు విజ్ఞప్తి

హైదరాబాద్: రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి, అధికారులతో ఎమ్మెల్యేలు చర్చించారు. ముఖ్యంగా SLBC, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువలు, అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించారు.నకిరేకల్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించేలా పెండింగ్‌లో ఉన్న కాలువల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు.అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, అవసరమైన నిధులను త్వరగా విడుదల చేసి పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే నకిరేకల్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడి, వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.