మిర్యాలగూడ: పట్టణంలోని ఇస్లాంపురలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెప్పుల దుకాణం ఉన్న భవనంలో మంటలు చెలరేగడంతో పై అంతస్తుల్లో నివసిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు లోపల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దట్టమైన పొగ, మంటల మధ్య చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించి కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడిన పోలీసుల చర్యపై ప్రశంసలు వ్యక్తమయ్యాయి.
మంటల్లో చిక్కుకున్న ఐదుగురు.. రక్షించిన పోలీసులు
0
6
Previous article
Next article
- Advertisment -

