Monday, October 12, 2026
prajasamkshemam news
Homeక్రైమ్రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి

📰 Generate e-Paper Clip

చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన యాదాద్రి జోన్ ఐజీ షానవాజ్ ఖాసీం
చిట్యాల, ప్రజా సంక్షేమం న్యూస్:

యాదాద్రి జోన్ ఐజీ షానవాజ్ ఖాసీం, ఐపీఎస్‌ చిట్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డులు, శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ తనిఖీలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్‌ పాల్గొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హైవేలపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఐజీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణకు నిఘా పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఫిర్యాదుదారులకు మర్యాదపూర్వకంగా, సత్వర సేవలు అందించాలని ఐజీ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణ, ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.