35 పోలీసు జట్లు పాల్గొనే అవకాశం.. పర్యవేక్షణకు 10 ప్రత్యేక కమిటీలు**
ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:3వ అఖిల భారత పోలీస్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ 2026–27 నిర్వహణకు సంబంధించి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోలీసుల ఆతిథ్యంలో తొలిసారిగా హైదరాబాద్లో డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరగనున్న ఈ జాతీయ స్థాయి టోర్నీని విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.టోర్నీకి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన సుమారు 35 జట్లు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా, వసతి, భద్రత, సాంకేతిక సహకారం తదితర కీలక అంశాలపై డీజీపీ వివరంగా సమీక్షించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసేలా ఏర్పాట్ల పర్యవేక్షణకు సుమారు 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ పోలీసు బలగాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాల మధ్య స్నేహసంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ టోర్నీలో తాను కూడా మైదానంలోకి దిగి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు.
పోలీస్ టీ20 టోర్నీ ఏర్పాట్లపై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
RELATED ARTICLES

