దివంగత పంచాయతీ కార్యదర్శి అంజయ్య కుటుంబానికి అండగా ఉద్యోగులు.. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తా: కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ, అక్టోబర్ 30 (ప్రజా సంక్షేమం న్యూస్):
తోటి ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచి పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులు మానవత్వాన్ని చాటుకున్నారు. దివంగత పంచాయతీ కార్యదర్శి శ్రీపతి అంజయ్య కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉద్యోగులు, యూనియన్ నాయకులు, శ్రేయోభిలాషులు సమష్టిగా సేకరించిన రూ.6,01,751 ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ చేతుల మీదుగా అంజయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంజయ్య భార్యకు ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీ పట్ల కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.తోటి ఉద్యోగి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ ఐక్యంగా స్పందించి ఆర్థిక సహాయం అందించడం ఉద్యోగుల ఐక్యతకు, మానవీయ విలువలకు నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, డీపీవో తరుణ్ చక్రవర్తి, చండూర్ ఎంపీడీవో బి. యాదగిరి, నల్లగొండ ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఎంపీవో పర్వేజ్, పంచాయతీ కార్యదర్శుల యూనియన్ నాయకులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తోటి ఉద్యోగి కుటుంబానికి రూ.6.01 లక్షల ఆర్థిక సాయం
RELATED ARTICLES

