Friday, November 13, 2026
prajasamkshemam news
Homeక్రైమ్పెండింగ్ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి

పెండింగ్ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.. నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చూడాలి

📰 Generate e-Paper Clip

హాలియా పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్**
అక్టోబర్ 30, ప్రజా సంక్షేమం న్యూస్, హాలియా:

నల్లగొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, సిబ్బంది పనితీరు, సీసీ కెమెరాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, పక్కా ఆధారాలతో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని చట్టపరిధిలో పరిష్కరించాలని తెలిపారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సూచించారు.ఈ తనిఖీలో మిర్యాలగూడ ఇన్‌చార్జి డీఎస్పీ రవి, హాలియా సీఐ రాఘవరావు, ఎస్‌ఐ సాయి ప్రశాంత్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.