జానారెడ్డిపై ఆరోపణలు చేయడం రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత బహిరంగ లేఖ
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డిపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తీన్మార్ మల్లన్నకు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన జానారెడ్డి అజాతశత్రువని, హింసకు తావులేని రాజకీయాలను నడిపి నల్లగొండ జిల్లాను ఆదర్శ రాజకీయ క్షేత్రంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. నక్సలైట్ల లొంగుబాటుకు కృషి చేసి, వారికి పునరావాసం కల్పించిన మానవతావాది అని కొనియాడారు.జిల్లా తాగు, సాగునీటి అవసరాల కోసం పాలకులను ఒప్పించి పలు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన నాయకుడు జానారెడ్డి అని తెలిపారు. బలహీన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఆయన అడ్డుపడ్డారంటూ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని విమర్శించారు.దళిత, బహుజన వర్గాల పక్షపాతిగా నిలిచిన జానారెడ్డి తనలాంటి పేద బీసీ బిడ్డకు నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని గుర్తుచేశారు. బాలు నాయక్, శంకర్ నాయక్ వంటి గిరిజన నాయకులతో పాటు కొండేటి మల్లయ్య వంటి దళిత నాయకులకు రాజకీయ మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు.జానారెడ్డి రాజకీయ సేవలు, సామాజిక నిబద్ధతను తెలుసుకోకుండా ఆయనపై నిరాధార ఆరోపణలు చేయడం తీన్మార్ మల్లన్న రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పున్న కైలాష్ నేత తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం : పున్న కైలాష్ నేత
RELATED ARTICLES

