రైతులకు ఫార్మర్ ఐడీ,డిజిటల్ క్రాప్ సర్వేపై విస్తృత అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ, ప్రజా సంక్షేమం న్యూస్:రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగంలో పారదర్శకత, ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా అగ్రిస్టాక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.ఫార్మర్ ఐడీ (రైతు గుర్తింపు కార్డు), డిజిటల్ క్రాప్ సర్వే, భూముల డిజిటలైజేషన్ వంటి అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా మెరుగైన సాగు పద్ధతులు పాటించి, అధిక దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, వివిధ సేవలు, బ్యాంకు రుణాలు అర్హులైన రైతులకు సులభంగా, పారదర్శకంగా అందేలా అగ్రిస్టాక్ కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రామస్థాయిలో రైతులకు అగ్రిస్టాక్ ప్రయోజనాలను వివరించి, డిజిటల్ వ్యవసాయ సేవల అమలును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
అగ్రిస్టాక్ అమలుతో రైతులకు డిజిటల్ సేవలు మరింత చేరువ కావాలి
RELATED ARTICLES

