Friday, November 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణనవంబర్ 14న నల్లగొండలో కల్చరల్ ఫెస్ట్ – ఆటపాటల సాంస్కృతిక ఉత్సవం

నవంబర్ 14న నల్లగొండలో కల్చరల్ ఫెస్ట్ – ఆటపాటల సాంస్కృతిక ఉత్సవం

📰 Generate e-Paper Clip

–రైతాంగ సమస్యలపై కళారూపాలతో ప్రజల్లో చైతన్యం
-36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ:
అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల సందర్భంగా నవంబర్ 14న నల్లగొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్‌లో భారీ స్థాయిలో కల్చరల్ ఫెస్ట్ (కళా సాంస్కృతిక ఉత్సవం) నిర్వహించనున్నట్లు ఫెస్ట్ ఇన్‌చార్జి పాలడుగు నాగార్జున తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధర వంటి కీలక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ కళారూపాలతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ప్రజా కళాకారులు తమ ఆటపాటల ద్వారా రైతాంగ సమస్యలు, ప్రజా ఉద్యమాల చరిత్ర, సామాజిక అంశాలను ప్రజల ముందుకు తీసుకురానున్నారని తెలిపారు. పాటలు, నృత్యాలు, జానపద కళారూపాలు, నాటికలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.కళలు కేవలం వినోదానికే పరిమితం కాకుండా సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ప్రజా సమస్యలను ప్రతిబింబించడానికి, ఉద్యమాలకు స్ఫూర్తినివ్వడానికి దోహదపడతాయని అన్నారు. రైతాంగ పోరాటాల్లో కళారూపాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేశారు.నవంబర్ 14న ఉదయం 10 గంటలకు కల్చరల్ ఫెస్ట్ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి నల్లగొండ పట్టణ ప్రజలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నాయకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కల్చరల్ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని పాలడుగు నాగార్జున విజ్ఞప్తి చేశారు.ఈ విలేకరుల సమావేశంలో ఆవుట రవీందర్, భీమగాని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.