Sunday, November 29, 2026
prajasamkshemam news
Homeజాతీయంఅమ్మ ఒడి.. ఉద్యమ బడి!

అమ్మ ఒడి.. ఉద్యమ బడి!

📰 Generate e-Paper Clip

మూడు నెలల పసికందుతో ఏఐకేఎస్ జాతీయ మహాసభలకు హాజరైన ఝార్ఖండ్ మహిళా ఉద్యమకారిణి మీలా కుమారీ మాతృత్వం, ఉద్యమ నిబద్ధతను సమన్వయం చేస్తూ మహిళాలోకానికి ఆదర్శం
నల్లగొండ, నవంబర్ 16 (ప్రజాసంక్షేమం న్యూస్):

ఒక చేత్తో పసికందును అక్కున చేర్చుకుంటూ.. మరో చేత్తో ఎర్రజెండా ఆశయాలను ఎత్తిపట్టిన మహిళా ఉద్యమకారిణి మీలా కుమారి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాతృత్వం ఉద్యమాలకు అడ్డంకి కాదని, కుటుంబ బాధ్యతలు ఆశయ సాధనకు సంకెళ్లు కావని తన ఆచరణతో నిరూపిస్తున్నారు.నల్లగొండ వేదికగా నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలకు ఝార్ఖండ్ రాష్ట్రం గుమ్లా జిల్లా నుంచి ప్రతినిధిగా మీలా కుమారి హాజరయ్యారు. కేవలం మూడు నెలల పసికందును వెంట తీసుకుని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహాసభలకు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఒకవైపు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ, మరోవైపు రైతాంగ సమస్యలపై జరిగే చర్చలు, ఉద్యమ కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తల్లిగా బిడ్డకు ప్రేమను పంచుతూనే.. సమాజం పట్ల బాధ్యతతో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్న ఆమె పట్టుదల పలువురిని ఆకట్టుకుంటోంది.మహిళలు కుటుంబ బాధ్యతలకే పరిమితం కాకుండా సామాజిక, రాజకీయ, రైతాంగ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించగలరని మీలా కుమారి చాటిచెబుతున్నారు. మాతృత్వంలోని మమకారాన్ని, ఉద్యమంలోని నిబద్ధతను సమన్వయం చేసుకుంటూ సాగుతున్న ఆమె ప్రయాణం మహిళాలోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.బిడ్డకు తల్లిప్రేమను పంచుతూనే సమాజ మార్పు కోసం పోరాట పథంలో ముందుకు సాగుతున్న మీలా కుమారి సంకల్పం అభినందనీయం. ఆమె మాతృత్వానికి, ఉద్యమ నిబద్ధతకు, పోరాట స్ఫూర్తికి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.అమ్మ ఒడిలో మాతృత్వం.. అడుగుల్లో ఉద్యమ స్ఫూర్తి.. మీలా కుమారికి లాల్ సలామ్!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.