Saturday, August 22, 2026
prajasamkshemam news
HomeUncategorizedసబ్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం .

సబ్ సెంటర్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం .

📰 Generate e-Paper Clip

 నియోజకవర్గ వ్యాప్తంగా సబ్ సెంటర్లు పీహెచ్సీలు సిహెచ్సిలు ఏరియా ఆసుపత్రులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, సిబ్బంది, సాంకేతిక పరికరాలు, కావలసిన నిధులకు సంబంధించిన వివరాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండ జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు..

మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పై యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారులు నల్గొండ జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మునుగోడు, నాంపల్లి, పిహెచ్సిల ఆధునీకరణతోపాటు 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం, మర్రిగూడ సిహెచ్సి ని 30 పడకల నుండి 50 పడకలకు పెంచడం సిబ్బంది నియామకం సాంకేతిక పరికరాల కల్పన పోస్టుమార్టం ఎగ్జామిన్ రూమ్,, చండూరు రెవిన్యూ కేంద్రంలో వంద పడకలతో ఏరియా ఆసుపత్రి మంజురు నిర్మాణం, గట్టుపల్ పిహెచ్సికి సిబ్బంది నియామకం సాంకేతిక పరికరాల కల్పన కు కావలసిన అంచనాలు రూపొందించాలన్నారు.

జాతీయ రహదారి 65 పై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్లో హైదరాబాదు తీసుకెళ్లలేకపోతున్నారని ఈలోపే చాలామంది మరణిస్తున్నారని.. చౌటుప్పల్ ప్రాంతంలో అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు… ట్రామా కేర్ సెంటర్ తో పాటు చౌటుప్పల్లో వంద పడకల ఏరియా ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేసి సాంకేతిక పరికరాల కల్పనతో ఆధునికరించాల్సిన అవసరం ఉందన్నారు…ప్రైవేట్ ఆస్పత్రిలో బిల్లులు కట్టలేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తు చేస్తూ ప్రజా వైద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు..

ప్రస్తుతం గ్రామాలలో నిర్మించే ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాల బడ్జెట్ మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ధరలు, అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా సరిపోవడం లేదని సబ్ సెంటర్లతో పాటు పిహెచ్సిలు సిహెచ్సీ లు, ఏరియా ఆసుపత్రుల బడ్జెట్ పెంపు విషయం కూడా ఆరోగ్యశాఖ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు…

పీహెచ్సీలలో సిహెచ్సి లలో డాక్టర్లు కమిట్మెంట్తో పని చేయాలని, అన్ని వృత్తుల కంటే డాక్టర్ వృత్తి ఎంతో గొప్పదని బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించొద్దన్నారు…

ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ జిల్లా డి ఎం హెచ్ ఓ రాహుల్, డి సి హెచ్ మాతృ నాయక్, యాదాద్రి భువనగిరి జిల్లా డి ఎం హెచ్ ఓ మనోహర్, డి సి హెచ్ సూర్య శ్రీ లతో పాటు మర్రిగూడ చౌటుప్పల్ సిహెచ్సి వైద్యాధికారులు, చండూరు మునుగోడు నాంపల్లి మర్రిగూడ వైద్యాధికారులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.