Tuesday, October 13, 2026
prajasamkshemam news
Homeతెలంగాణఅర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

📰 Generate e-Paper Clip

బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్
మునుగోడు, సెప్టెంబర్ 28 (ప్రజా సంక్షేమం న్యూస్):

మునుగోడు మండలంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో అసలైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని బీజేపీ లేబర్ సెల్ జిల్లా కో-కన్వీనర్ మాధగోని నరేందర్ గౌడ్ ఆరోపించారు.అన్ని వసతులు ఉన్న కొంతమందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అర్హులైన పేదలకు మాత్రం ఇళ్లు దక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రతి గ్రామానికి స్వయంగా వెళ్లి అర్హత కలిగిన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా గుర్తించాలని కోరారు.మధ్యవర్తులు, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా పారదర్శకంగా అర్హులైన నిరుపేదలను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.