Monday, October 12, 2026
prajasamkshemam news
Homeజాతీయంఅర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించాలి..

అర్హులైన ప్రతి ఓటరు హక్కును పరిరక్షించాలి..

📰 Generate e-Paper Clip

SIR ప్రక్రియపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ
డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకూడదు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హులైన ప్రతి ఓటరు హక్కు పరిరక్షించబడేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని పేర్కొన్నారు.దేశ జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్య తగ్గడం ఎలా సాధ్యమవుతుందని సీఎం ప్రశ్నించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓటర్ల అర్హత నిర్ధారణ వంటి ప్రక్రియలు పారదర్శకంగా, ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఉండాలని అన్నారు. ఓటు హక్కుపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘ది కాంక్లేవ్ 2026’లో సీఎం కీలక వ్యాఖ్యలు:అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ‘India’s Next Chapter’ అంశంపై జరిగిన చర్చలో దేశ భవిష్యత్ దిశ, విద్య, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, డీలిమిటేషన్, SIR తదితర అంశాలపై మాట్లాడారు.దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు సంబంధించిన మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంపై ఆందోళన!నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావించిన సీఎం.. జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్‌లో రాజకీయంగా నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే జాతీయ విధానాల రూపకల్పనలో వాటి వాదన బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
విద్య,నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి:విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ఆధారంగా తెలంగాణను అభివృద్ధి చేసి దేశ ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం,నర్సరీ విద్య వంటి అంశాల్లో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా రంగంలో సంస్కరణలు చేపడుతున్నామని చెప్పారు.ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్‌పై కూడా విద్యార్థులకు పట్టు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించాలని,12వ తరగతి తర్వాత విద్యార్థుల్లో ఉద్యోగ, ఉపాధికి అవసరమైన నైపుణ్యాల అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PS News App

Add to home screen for faster loading and latest updates.